కూటమివి ప్రజా వ్యతిరేక విధానాలు
పాలకొల్లుసెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సూచించారు. గు రువారం పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపీ నివాసంలో జరిగిన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కూటమి పాలన రెండేళ్లకు దగ్గరపడుతున్నా సూపర్‌సిక్స్ హామీల అ మల్లో పూర్తిగా సర్కారు విఫలమైందన్నారు. నామమాత్రంగా కొన్ని పథకాలు అమలు చేసి గొప్పలు చెప్పుకోవడం మినహా మరేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, మహిళలు, రైతు లు, కార్మికులు ఇలా అన్నివర్గాలూ అవస్థలు పడుతున్నాయన్నారు. సంక్రాంతి సమీపిస్తున్న ఎక్కడా పండుగ సందడి లేదని, జనం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆందోళనలోకి వెళ్లిందన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ప్రసాద రాజు సూచించారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, సీనియర్ నేతలు గుణ్ణం నాగబాబు, చెల్లం ఆనంద్ ప్రకాష్, చేగొండి సూర్య ప్రకాష్, పార్లమెంట్ కార్యదర్శి యడ్ల తాతాజీ, జెడ్పీటీసీలు నడపన గోవిందరాజులు నా యుడు, గుంటూరి పెద్దిరాజు, యలమంచిలి మండల సీనియర్ నేత దత్తాత్రేయ వర్మ, ఎంపీపీలు ఇనుకొండ రవికుమార్, సుమంగళి, పార్టీ మండల అధ్యక్షుడు కోరాడ శ్రీను, ఉచ్చుల స్టాలిన్, యేసురాజు, కొరప్రాటి వీరస్వామి, పార్టీ జనరల్ సెక్రెటరీ ఖండవల్లి వాసు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు


