నూరు శాతం ఫలితాలు సాధించాలి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పది పరీక్షా ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు సాధనకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు, గణపవరం మండలాల ప్రధానోపాధ్యాయులతో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో నారాయణ మాట్లాడుతూ స్లిప్ టెస్ట్‌ల నిర్వహణ, మార్కుల జాబితా, విద్యార్థుల గైర్హాజరు వంటి అంశాలు తెలిపారు. విద్యార్థులు గైర్హాజరు కావడంపై పెంటపాడు, గణపవరం ఎంఈవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీవైఈవో కేవీఎస్.రామాంజనేయులు, మండల విద్యాశాఖాధికారులు వి.హనుమ, రాజేష్, బాలయ్య, టీవీ.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


