ఇదేనా చెత్తశుద్ధి ! | - | Sakshi
Sakshi News home page

ఇదేనా చెత్తశుద్ధి !

Jan 7 2026 7:21 AM | Updated on Jan 7 2026 7:21 AM

ఇదేనా

ఇదేనా చెత్తశుద్ధి !

త్వరలో అన్ని మరమ్మతులూ చేయిస్తాం

పాలకొల్లు సెంట్రల్‌: పట్టణంలో పారిశుద్ధ్యం కోసం వినియోగించే యంత్రాలు మూలనపడ్డాయి. 2017లో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పాలకొల్లు మున్సిపాలిటీకి రెండు కాంప్యాక్ట్‌ వాహనాలు, మూడు పాప్‌కాట్‌లు, స్వీపింగ్‌ మిషన్‌లు వచ్చాయి. ఆరు మున్సిపల్‌ ట్రాక్టర్లు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించగా పట్టణంలో 14 సచివాలయాలను ఏర్పాటు చేసి 14 చెత్త సేకరించే క్లాప్‌ వ్యాన్లను కేటాయించారు. ఆరు ట్రాక్టర్లలో రెండు పాడవగా.. ఒకటి మరమ్మతులు పూర్తయ్యి ఇటీవల కార్యాలయానికి చేరుకుంది. చెత్తను డంప్‌ చేసుకుని వెళ్లే కాంప్యాక్ట్‌ వాహనాలు రెండు మరమ్మతులకు వెళ్లాయి. పాప్‌కాట్‌ వాహనాలు మూడు మూలకు చేరాయి. వీటితో పెద్ద డ్రైనేజీల్లో సిల్ట్‌ను తొలగించే అవకాశం ఉంటుంది. ఇవి పనిచేయకపోవడం వల్ల సిల్ట్‌ తీయడానికి లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. రోడ్లను శుభ్రం చేసే స్వీపింగ్‌ మిషన్‌ 2018లో పాలకొల్లు మున్సిపాలిటీకి వచ్చింది. అప్పటి నుంచి దీనిని పది సార్లు కూడా ఉపయోగించిన పరిస్థితి లేరు.

ఇంజినీరింగ్‌ విభాగం నిర్లక్ష్య ధోరణి : పాలకొల్లు మునిసిపాలిటీలో ఏ వాహనం మరమ్మతు వచ్చినా వెంటనే సంబంధిత శానిటరీ అధికారులు ఇంజనీరింగ్‌ విభాగానికి సమాచారం ఇస్తారు. రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ , శానిటేషన్‌ ఇలా ఏ విభాగంలో పనులు జరగాలన్నా ఇంజనీరింగ్‌ విభాగానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇంజనీరింగ్‌ విభాగం నుంచి అనుమతి రావాలంటే పుణ్యకాలం గడిచిపోతుందని కార్యాలయంలో ఉన్న అన్ని శాఖల సిబ్బంది వాపోతున్నారు. కుర్చీలు, బల్లలకు కూడా ఇంజనీరింగ్‌ విభాగం నుంచి అనుమతుల కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమైన వాహనాలు మరమ్మతులు విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుం డడంతో మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయి.

స్పెషల్‌ గ్రేడ్‌ అంటే ఇదేనా..

పాలకొల్లు మున్సిపాలిటీ గత సంవత్సరం స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీ ఆదాయం, జనాభా ప్రామాణికంగా గ్రేడ్‌ను సెలెక్ట్‌ చేస్తారు. పాలకొల్లు ఆదాయం సుమారు రూ.25 నుంచి రూ.30 కోట్లకు చేరుకోవడం.. జనాభా 80 వేలు దాటడంతో పాలకొల్లు మునిసిపాలిటీ స్పెషల్‌ గ్రేడ్‌గా మార్చారు. దీంతో మున్సిపాలిటీ రూపురేఖలు మారే అవకాశం ఉంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

పాలకొల్లు మున్సిపాలిటీలో మూలనపడ్డ పారిశుద్ధ్య వాహనాలు

మున్సిపాలిటీలో కొన్ని వాహనాలు మరమ్మతుల వల్ల మూలకు చేరుకున్నాయి. కొన్ని రిపేర్‌కు పంపాం. అన్నీ బాగు చేయించి రన్నింగ్‌లో పెడతాం. త్వరలో కొత్త వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శానిటేషన్‌కు ఎలాంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. రోడ్లపై వేస్తున్న చెత్త కోసం ప్రజల్లో ఇప్పటికే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– బి.విజయ సారథి, మున్సిపల్‌ కమిషనర్‌, పాలకొల్లు

ఇదేనా చెత్తశుద్ధి ! 1
1/4

ఇదేనా చెత్తశుద్ధి !

ఇదేనా చెత్తశుద్ధి ! 2
2/4

ఇదేనా చెత్తశుద్ధి !

ఇదేనా చెత్తశుద్ధి ! 3
3/4

ఇదేనా చెత్తశుద్ధి !

ఇదేనా చెత్తశుద్ధి ! 4
4/4

ఇదేనా చెత్తశుద్ధి !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement