లారీ ఢీకొని పీజీ విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని పీజీ విద్యార్థిని మృతి

Jun 22 2024 12:28 AM | Updated on Jun 22 2024 6:38 AM

-

పెనుమంట్ర: పెనుగొండ రోడ్డులోని నెగ్గిపూడి లాకుల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవగానుగుల గీతావాణి(23) మృతిచెందింది. మార్టేరు శివరావుపేటకు చెందిన గీతావాణి పరీక్షలు రాసేందుకు స్కూటర్‌పై పెనుగొండ వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

గీతావాణికి వేలివెన్నుకు చెందిన వెంకటేశ్వరరావుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఎంబీఏ చదువుతున్న గీతావాణి పరీక్షలు రాసేందుకు వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చి పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో పరీక్షలు రాస్తోంది. భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రజనీ కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమంట్ర ఇన్‌చార్జి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement