ఆక్వాకు అండగా.. అన్నొస్తున్నాడు | - | Sakshi
Sakshi News home page

ఆక్వాకు అండగా.. అన్నొస్తున్నాడు

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

వైఎస్సార్‌సీపీ శ్రేణుల సన్నాహాలు

సిండికేట్‌ వల్లే ధరల తగ్గుదల

జగనన్నతోనే ఆక్వాకు న్యాయం

విదేశీ మారకద్రవ్యంతో దేశానికి మేలు చేస్తున్న ఆక్వా రైతులు చంద్రబాబు సర్కారు దగాతో రోడ్డున పడ్డారు. సీడ్‌, ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు సిండికేటు దోపిడీతో సాగు భారమై దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. దగాపడ్ట తమ పక్షాన ప్రభుత్వంపై సమరభేరి మోగించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం ఆక్వా రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

సాక్షి, భీమవరం: ఫీడ్‌ కంపెనీలు ఇష్టానుసారం పెంచిన ఆక్వా మేత ధరలు తగ్గించాలని, రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఆక్వా రైతులకిచ్చిన ఎన్నికల హామీలు అమలుచేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం జారీచేశారు. లక్షలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసి సిండికేటు ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు సర్కారు నిగ్గు తేల్చేందుకు ఈనెల 15న నేరుగా ఆయనే భీమవరం వస్తున్నారు. సీడ్‌, ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్లు చేస్తున్న మోసాలు, దోపిడీ, ఇతర సమస్యలపై ఉండి బైపాస్‌ రోడ్డులో ఏర్పాటుచేయనున్న వేదిక వద్ద రైతులతో భేటీ కానున్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం పోరాటం సాగించనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ రాక కోసం ఉభయగోదావరితో పాటు కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పటికైనా ప్రభుత్వం చల నం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు.

వేదిక స్థలం పరిశీలన

ఉండి బైపాస్‌ రోడ్డులోని బీవీ రాజు విగ్రహం సమీపంలో ఏర్పాటుచేయనున్న ముఖాముఖీ వేదిక స్థలాన్ని శనివారం జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ చినమిల్లి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు పరిశీలించారు. ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే పర్యటన అనుమతుల కోసం కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణిని పార్టీ నేతలు క లిసి వినతిపత్రం అందజేశారు. ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్లమెంట్‌ సెక్రటరీ యడ్ల తాతాజీ, పార్టీ నేతలు కోడే యుగంధర్‌, గాదిరాజు రామరాజు, చిలుకూరి దత్తాత్రేయవర్మ తదితరులు పాల్గొన్నారు.

అధినేత పర్యటనకు సంబంధించిన సన్నాహాల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గం నిమగ్నమైంది. పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్నాథ్‌ నేతృత్వంలో ఇటీవల ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఉమ్మడి పశ్చిమగోదావరితో పాటు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు తరలిరానున్నారు. ఆక్వా రైతులకు కోసం జిల్లాకు వస్తున్న జగన్‌కు ఘన స్వాగతం పలికి పర్యటన విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా అంతటా నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

రొయ్య రైతుల కష్టాలపై పోరుబాట

15న వైఎస్‌ జగన్‌ భీమవరం రాక

ఉండి బైపాస్‌ రోడ్డులో ఆక్వా రైతులతో ముఖాముఖీ

ఏర్పాట్లలో వైఎస్సార్‌సీపీ నేతలు

రొయ్యల ఎగుమతిదారుల సిండికేట్‌ వల్లే రొయ్యల ధరలు తగ్గించివేస్తున్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మేత ధరల్ని ఇష్టానుసారం పెంచేస్తున్నారు. ముడిసరుకు ధరలు తగ్గినా మేత ధరల్ని తగ్గించడం లేదు. ధర ఒరల్లో రైతులు నలిగిపోతున్నారు. విద్యుత్‌ రాయితీల హామీని అమలుజేయాలి. రైతులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు.

– పాతపాటి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం

ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నా రొయ్య రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. జగనన్న వస్తేనే ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని మా నమ్మకం. ఫీడు కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలానే కొనసాగితే ఆక్వా సాగు చేసే పరిస్థితి లేదు. జగనన్న రాక కోసం రొయ్య రైతులంతా ఎదురుచూస్తున్నాం.

– కె.సర్వేశ్వరరావు, రొయ్యల రైతు, రాయకుదురు, వీరవాసరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement