ఆరోగ్యకర కుటుంబాలు శ్రేయస్కరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకర కుటుంబాలు శ్రేయస్కరం

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

ఆరోగ్యకర కుటుంబాలు శ్రేయస్కరం డిజిటలైజేషన్‌ వేగిరపర్చాలి టీచర్లలో టెట్‌ ఆందోళన ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం తూట్లు ఎకై ్సజ్‌ సీఐల నియామకం

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం చౌక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు అవాగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడుతూ.. దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా కీలకమన్నారు. ఈనెల 18 వరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డీఎంహెచ్‌ఓ ఎం.రవిబాబు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి దేవసుధ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి సుజాత లక్ష్మి, సీడీపీఓ లక్ష్మీకాంతం పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. జిల్లాలో సర్‌ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్‌ పురోగతిపై శనివారం గూగుల్‌ మీట్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. నిర్దేశిత గడువులోపు నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సూచించారు. డీఆర్వో, ఆర్డీఓ లు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

భీమవరం: మూడేళ్ల వ్యవధిలోని ఇన్‌సర్వీస్‌ టీచర్లంతా తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణులు కావా లనే నిబంధనతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని, దీనిపై ప్రభుత్వం స్పందించి టెట్‌ నుంచి మినహాయించాలని ఎమ్మెల్సీ బొ ర్రా గోపీమూర్తి డిమాండ్‌ చేశారు. భీమవరంలో శనివారం ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌పై అవ గాహన కోసం యూటీఎఫ్‌ ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. టెట్‌ మినహాయింపు ఇచ్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు టెట్‌పై అవగాహన, శిక్షణ తరగతులు, స్టడీ మెటీరియల్‌ అందజేత అభినందనీయమన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ విజయరామరాజు, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీవీ రామానుజరావు(గాంధీ), జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: పేదలకు పట్టెడన్నం పెడుతున్న ప్ర జా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ధ్వజమెత్తారు. అంత్యోదయ అన్నయోజన కార్డులపై ఇచ్చే బియ్యం కుదింపునకు నిరసనగా పట్టణంలోని మెంటేవారితోటలో శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 35 కిలోల బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కుదించి ఒకరికి ఏడు కిలోలు ఇస్తాననే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు జక్కంశెట్టి సత్యనారా యణ, ఎ.రవి, ఆకుల హరేరామ్‌, మామిడి శెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రేషన్‌ కార్డుపై 16 రకాల నిత్యావసర సరుకులు అందించాల న్నారు. నాయకులు కొల్లాటి శ్రీనివాస్‌, జుత్తిగ నర్సింహమూర్తి, పి.పూర్ణ, జి.రామకృష్ణ, కేతా గోపాలన్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలోని రెండు ఎకై ్సజ్‌ స్టేషన్లకు సీఐలను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయని ఎకై ్సజ్‌ శాఖ జిల్లా పర్యవేక్షకుడు బి.సుబ్బా రావు తెలిపారు. భీమవరం స్టేషన్‌కు జి.బసంతి, పాలకొల్లుకు ఎం.రామశేషయ్య పదోన్నతిపై వస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement