న్యూస్‌రీల్
– వివరాలు 8లోu
మండలాల వారీగా తేదీల కేటాయింపు
స్పోర్ట్స్ హబ్‌గా వరంగల్ అభివృద్ధి
వరంగల్‌ను విద్య, వైద్య రంగాలతోపాటు క్రీడారంగంలోనూ దేశస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు.
మంగళవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా తెలంగాణ సీఐడీ మరో కీలక అడుగు వేసింది. ఏళ్ల తరబడి తమ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారుల గుర్తింపు, వారి క్లెయిమ్‌ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ప్రత్యేక బాండ్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనుంది. దీనికోసం వరంగల్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి జిల్లా, మండలాల వారీగా షెడ్యూల్ విడుదల చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల కోసం వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రాణి రుద్రమదేవి హాల్‌లో ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరు జిల్లాల పరిధిలోని ఖాతాదారులు తమకు కేటాయించిన తేదీల్లో ఇక్కడికి వచ్చి బాండ్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలనకు అందించాలి. ఈ కేంద్రానికి ప్రత్యేక అధికారిగా ఈ.హరికృష్ణను నియమించారు.
బాండ్లతోపాటు ఇతర పత్రాలు తప్పనిసరి.. నామినీ, వారసులకు అవకాశం
వెరిఫికేషన్‌కు వచ్చే బాధితులు అసలు అగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రశీదును తీసుకురావాలి. వీటితోపాటు బాండ్ కలర్ జిరాక్స్‌పై సంతకం చేసి సమర్పించాలి. ఆధార్, పాన్‌కార్డుల ప్రతులు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఖాతాదారుడి మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తెలిసి ఉంటే ఆ వివరాలు కూడా అందించాలి. ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే నామినీ ద్వారా బాండ్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. నామినీ కూడా మరణించిన సందర్భంలో చట్టబద్ధ వారసులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి. డిపాజిటర్ అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వ్యక్తిగతంగా రాలేని పక్షంలో కుటుంబ సభ్యులు అధికార లేఖతో హాజరై ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఏజెంట్లు సైతం తమ వద్ద ఉన్న బాండ్ల వివరాలను సంబంధిత పత్రాలతో అందించే అవకాశం కల్పించారు.
అసలు బాండ్ తిరిగి తీసుకోవచ్చు
అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సి న అవసరం లేదని సీఐడీ స్పష్టం చేసింది. పరిశీలన కోసమే ఒరిజినల్ బాండ్లను చూపించాలి. వాటి కలర్ జిరాక్స్ ప్రతులను సంతకం చేసి సమర్పించాలి. అధికారులు స్వీకరించిన పత్రాలకు రశీదు ఇస్తారు. ఈ ప్రక్రియ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే హాజరుకావాలని సూచించారు. అసలైన ఖాతాదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా రోజుకు సుమారు 250 మంది ఖాతాదారుల పత్రాలను పరిశీలించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జూలై 30 వరకు కొనసాగనుంది.


