నేడు జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ప్రజా వాణిని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టర్‌, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.

నేడు బాలల ప్రజావాణి

బాలల వారోత్సవాల సందర్భంగా బాలల హ క్కుల పరిరక్షణే లక్ష్యంగా నేడు (సోమవారం) బాలల ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాజ మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్వంలో నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు, ప్రజా ప్రతినిధులు బాలల సంక్షేమంపై ఆసక్తిగల ప్ర తీఒక్కరు సద్వినియోగం చేసుకుని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

గవర్నర్‌ను కలిసిన

రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌

కాశిబుగ్గ: గవర్నర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రతాప్‌ శుక్లాను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బేతి అశోక్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశా రు. ఆదివారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లాకు సంబంధించిన చేనేత కార్పెట్‌, టవల్‌తో పాటు మెమోంటోతో సత్కరించారు. అనంతరం జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలను విస్తృత పరచడానికి సంస్థకు అవసరమైన స్థలాన్ని, తగిన నిధులను కెటాయించాలని కోరారు. రక్తనిధి సేకరణలో భాగంగా మండలాలు, గ్రామాల్లోని వార్డు స భ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ను ఏడాదిలో ఒకసారి రక్తనిధి సేకరణలో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన కొత్తవాడ, శా యంపేట ప్రాంతాల చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

అక్షరం, ఆర్థికం,

ఆరోగ్యమే లక్ష్యం

దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాల వారికి అక్షరం, ఆర్థికం, ఆరోగ్యంపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే స్వేరో లక్ష్యమని స్వేరో ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్‌ మంద శ్యామ్‌ అన్నారు. మండలంలోని నాచినపల్లి, మందపల్లి గ్రామాల్లో స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను సర్పంచ్‌ పెండ్యాల రాజుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వేరో విజయాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈనెల 22న హనుమకొండ కాళోజీ ప్రాంగణంలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. మండల ఇన్‌చార్జ్‌ మంద శ్రీనువాస్‌, కన్వీనర్‌ గోర్కటి రాజుకుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలి

నర్సంపేట: కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు విద్యా రంగంలో తీసుకువస్తున్న విద్యార్థి వ్యతిరేక సంస్కరణలపై విద్యార్థులు సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని మాస్‌ లైన్‌ పార్టీ ఆఫీస్‌లో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నర్సంపేట డివిజన్‌ నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఆదివారం అలవాల నరేష్‌ అ ధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ బిగి పిడికిల జెండాను డివిజన్‌ ఉపాధ్యక్షుడు కె.రాజు ఆవిష్కరించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర, రా ష్ట్ర ప్ర భుత్వాలు విద్యారంగంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పెట్టుబడి దారి బహుళ జాతి కంపెనీల మా ర్కెట్‌ ప్రయోజనాలు నెరవేర్చే సంస్కరణలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం పీడీఎస్‌యూ నర్సంపేట డివిజన్‌ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. డివిజన్‌ అధ్యక్షుడిగా ఈరెల్లి వికాస్‌, ప్రధాన కార్యదర్శిగా కే.రాజు, కోశాధికారిగా రామ్‌చరణ్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement