● మంత్రి సీతక్క
● రూ.58.44 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పర్వతగిరి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలని మంత్రి ధనసరి అనసూర్య (సీతక్క) అన్నారు. ఈ మేరకు మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో సర్పంచ్ గాడుదుల రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన హామ్ కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో రూ.58.44కోట్ల వ్యయంతో 68.61కిలో మీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, రేషన్ కార్డులు, కుటుంబ బీమా పథకాలు, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు మహిళా సంఘాల బలోపేతానికి వీఓ బిల్డింగ్‌లను మహిళల పేరున ఏర్పాటు చేస్తున్న ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. కాగా మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సభ ఉండగా 3 గంటలు ఆలస్యం కావడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు. అలాగే సభావేదికపై మంత్రి సీతక్కను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, జెడ్పీసీఈఓ వసంత, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీపీఓ కల్పన, పీఆర్ చీఫ్ ఇంజనీర్ సిద్దాంతం రామకృష్ణ, ఎస్‌ఈ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్, పీఆర్ డీఈ ప్రకాష్‌రావు, ఏఈ రఘువంశీ, ఈఈ పి.సురేష్, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ శేషు, తహసీల్దార్ వెంకటస్వామి, కల్లెడ పాక్స్ చైర్మన్‌లు పిన్నింటి అనిల్‌రావు, అత్తి కుమారస్వామి, భానోతు సింగులాల్, రాములు, ఇస్లావత్ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.


