ప్రతిష్ఠించిన చోటే గణపతి విగ్రహం నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠించిన చోటే గణపతి విగ్రహం నిమజ్జనం

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

వరంగల్‌ చౌరస్తా: వరంగల్‌ ఎల్లంబజార్‌లో 51 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వాహకుడు ఆకుతోట సంజయ్‌, భక్తులు 14 రోజులు విశేష పూజలు చేశారు. 14 రోజులు విశేష పూజల అనంతరం ఉత్సవాల నిర్వాహకులు పాలాభిషేకంతోపాటు రెండు ఫైర్‌ ఇంజన్ల నీళ్లతో మట్టి విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేశారు. అంతకు ముందు 51 కిలోల లడ్డూను రూ. 2.25 లక్షలకు కాజీపేటకు చెందిన శంకర్‌, లావణ్య తులసి, నాగరాజు దేవిక కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. నిమజ్జనం సందర్భంగా గణపతి నామస్మరణం మార్మోగింది.

‘సీఈసీ రాజీనామా చేయాలి’

నర్సంపేట: భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఓటు హక్కును ధ్వంసం చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని టీజేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మోదీ, అమిత్‌షాల జోడి కేంద్రంలో తమ అధికారాన్ని పదిల పర్చుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అని, ఈసీని ఉపయోగించుకుని సర్‌ ప్రక్రియ ద్వారా రాష్ట్రాల్లోని ఓట్లన్నీ కొల్లగొట్టి ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక అన్నారు. ఉన్న ఓట్లను తొలగిస్తూ ఓట్ల విధ్వంసానికి తెర లేపి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ ద్వారా సుమారు 88 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని, అప్లికేషన్‌ చేసుకోండి దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించండి అని అధికారులు చెప్పినప్పటికీ అదంతా సులభంగా అయ్యే పనిలా లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి ఇతర రాష్ట్రాలతో కలిసి దుర్మార్గంగా వ్యవహరిస్తూ భయంకరమైన కుట్రలు చేస్తూ, ప్రజల న్యాయబద్దమైన, రా జ్యాంగబద్దమైన ఓటు హక్కును చోరీ చేస్తున్న ఈసీకి వ్యతిరేకంగా, వెనకాల ఉండి చక్రం తిప్పుతున్న కేంద్ర ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పండ్ల మార్కెట్‌కు

స్థల పరిశీలన

గీసుకొండ: మండలంలోని విశ్వనాథపురంలో ఆధునిక పండ్ల మార్కెట్‌ ఏర్పాటునకు ప్రతిపాదిత స్థలాన్ని ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఏ.ప్రియాంక అనిల్‌తో కలిసి పరి శీలించారు. మార్కెట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థల విస్తీర్ణం, రహదారి, రవాణా, మౌలిక వసతుల లభ్యతను పరిశీలించారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఫ్రూట్‌ మార్కెట్‌ ఏర్పాటుతో రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు, స్థాని కంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు ప్రోత్సాహం లభి స్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిషోర్‌కుమార్‌, ఆర్డీఓ సుమ, ల్యాండ్‌ సర్వే అండ్‌ రికార్డ్స్‌ అధికారి శ్రీనివాసులు, జి ల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు, డైరెక్టర్‌ రుద్రప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రులు పొన్నం,

వివేక్‌కు దర్రీస్‌ బహూకరణ

కాశిబుగ్గ: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మ ణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో వరంగల్‌ కొత్తవాడలో తయారు చేసిన దర్రీస్‌లను రాష్ట్ర మంత్రులకు బహూకరించారు. జయంతి వేడుకలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని చేనేత సహకార సంఘాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, పద్మశాలి సంఘాల నుంచి వంద మందికి పైగా తరలివెళ్లారు. ఈసందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కార్మిక శాఖమంత్రి గడ్డం వివేక్‌కు చేనేత దర్రీస్‌లను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement