అక్షర జ్ఞానానికి ఉల్లాస్‌ కొత్త వెలుగు | - | Sakshi
Sakshi News home page

అక్షర జ్ఞానానికి ఉల్లాస్‌ కొత్త వెలుగు

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

కాళోజీ సెంటర్‌: మహిళల్లో అక్షర జ్ఞానానికి నవభారత్‌ సాక్షరత (ఉల్లాస్‌) కొత్త వెలుగునిస్తుందని అదనపు కలెక్టర్‌ వైవి గణేశ్‌ అన్నారు. మహిళలను సంపూర్ణ అక్షర జ్ఞానులుగా తీర్చిదిద్దే అక్ష్యంతో నవభారత్‌ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహిళలకు పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 18,854 మంది మహిళలను అక్షరజ్ఞానులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకోగా 365 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 16,223 మంది మహిళలు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్‌ జిల్లా ఉల్లాస్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, డీఎంసీ రేణుకతో కలిసి అదనపు కలెక్టర్‌ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడుతూ మహిళలు అక్షరజ్ఞానం సాధించడం ద్వారా తమ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ మరింత చురుకై న పాత్ర పోషించగలరన్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌, మార్చి నెలల్లో ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా 15 సంవత్సరాల పైబడిన మహిళలకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదనపు కలెక్టర్‌ వైవి గణేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement