కాకతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటాలి | - | Sakshi
Sakshi News home page

కాకతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

ఖిలా వరంగల్‌: కాకతీయుల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కా ర్యచరణతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్‌ మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణాల నడమ శిల్పాల ప్రాంగణంలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధ్యక్షతన ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హా జరై కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. చారిత్రక కట్టడాల పరిరక్షణతోపాటు హోటళ్లు రవాణా పార్కింగ్‌ వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ ఏఐటీ వంటి అధునిక సాంకేతికతను వినియోగించి కాకతీయుల చరిత్ర, నిర్మాణ శైలి, జీవన విధానాన్ని పర్యాటకులకు పరిచయం చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం కళా కా రుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీఓలు ఉమారాణి, సుమ, తహసీల్దార్లు ఇక్బాల్‌, శ్రీకాంత్‌, ప ర్యాటకశాఖ ఇన్‌చార్జ్‌ అనిల్‌, గజ్జల శ్యామ్‌, దామోదర్‌, బిల్లా శ్రీకాంత్‌, సాగర్ల శ్రీనివాస్‌, గుండు పూర్ణచందర్‌, గైడ్‌ రవియాదవ్‌లు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement