వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకోవాలి

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

వరంగల్‌ చౌరస్తా: యువత మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలో నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ ఫర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా హెల్త్‌ స్క్రీనింగ్‌ క్యాంపును కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువత డ్రగ్స్‌, మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు తదితర వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. అనంతరం యువతచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. రాజారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ రామ్‌కుమార్‌ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాష్‌, ప్రోగ్రాం అధికారి అరుణ్‌ జోషి, జిల్లా యువజన అధికారి బి.సంజీవ్‌, ప్రొఫెసర్‌ వెంకన్న, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement