ఖానాపురం: చదువుకొని వెళ్లిపోయారు.. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు..అపూర్వ సమ్మేళనం నిర్వహించాలనుకున్నారు.. సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ కలయికకు ఖానాపురం మండలంలోని పాకాల వేదికగా మారింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాకాలలో సంతోషాలతో గడిపారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. 1988–89 సంవత్సరంలో హైస్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశారు. 37 సంవత్సరాల తర్వాత అపూర్వ సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ద్వారా ఆత్మీయ కలయికను చేపట్టారు. పాకాలలో సందడి చేసి పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించారు. పూర్వవిద్యార్థులు అంబటి విజయలక్ష్మి, నీరజ, వసంత, శ్రీదేవి, ఉమ, హరిప్రసాద్, మహిపాల్‌రెడ్డి, హుస్సేన్, మోహన్, మురళీధర్, కిశోర్, రవి పలువురు పాల్గొన్నారు. నర్సంపేటకు చెందిన న్యాయవాది అంబటి శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులను ప్రత్యేకంగా సన్మానించారు.
37 సంవత్సరాల తర్వాత సందడి..


