వంగరలో అపూర్వ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

వంగరలో అపూర్వ సమ్మేళనం

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

వంగరలో అపూర్వ సమ్మేళనం

భీమదేవరపల్లి: మండలంలోని వంగరలో 1987–88 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. అప్పటి మధుర జ్ఞాపకాలను పరస్పరం పంచుకున్నారు. తమ విద్యాభివృద్ధికి, జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడానికి పునాది వేసిన గురువులను సత్కరించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పూర్వవిద్యార్థులు తెలిపారు. పూర్వ విద్యార్థులు డాక్టర్‌ సర్దార్‌ పటేల్‌, కె.నవీన్‌, వై.బాబు, బల్లు రమేశ్‌, గడిపె రాజు, ఎ.రమేశ్‌, మంచాల వెంకటస్వామి, ఆర్‌.తిరుపతిరెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement