67 ఏళ్లుగా వేయిస్తంభాల ఆలయంలో.. | - | Sakshi
Sakshi News home page

67 ఏళ్లుగా వేయిస్తంభాల ఆలయంలో..

Sep 13 2026 12:42 AM | Updated on Sep 13 2026 12:42 AM

67 ఏళ్లుగా వేయిస్తంభాల ఆలయంలో..

హన్మకొండ కల్చరల్‌: ఒకప్పుడు పబ్లిక్‌గార్డెన్‌ వద్ద నిర్వహించిన గణేశ్‌ ఉత్సవాన్ని 1933లో హనుమకొండలోని రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయంలోకి మార్చారు. 67 సంవత్సరాల క్రితం వేయిస్తంభాల దేవాలయానికి మార్చగా.. అప్పటి నుంచి నూతన గజానన మండలి అధ్వర్యంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయకులను ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు 15 ఏళ్లుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేయిస్తంభాల ఆలయంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలిరావడం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా వేయిస్తంభాల దేవాలయం వినాయక నిమజ్జనోత్సవ రథాన్ని దర్శించుకోవడానికి ప్రజలు మంగళ హారతులతో ఎదురుచూస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement