సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి

Sep 13 2026 12:42 AM | Updated on Sep 13 2026 12:42 AM

ఖిలా వరంగల్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్‌ పంట సర్వేను సమన్వయంతో, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యశారద సంబంధిత అధికారులకు సూ చించారు. ఖిలా వరంగల్‌ స్తంభంపల్లిలో నిర్వహిస్తున్న డిజిటల్‌ సర్వేను డీఏఓ విజయభాస్కర్‌, ఆర్డీఓ సుమ, తహసీల్దార్‌ ఇక్బాల్‌లతో కలి సి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత, భూముల హద్దులు, వివరాల నమోదు తదిత ర అంశాలపై ఆరాతీశారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి

వర్ధన్నపేట: రైతుల పంట వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా సర్వేయర్లు సర్వే చేపట్టాల ని డీఏఓ విజయభాస్కర్‌ అధికారులకు సూచించారు. వర్ధన్నపేటతోపాటు నల్లబెల్లి, ఇల్లందలో కొనసాగుతున్న పంటల డిజిటల్‌ సర్వేను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.. మండలంలో 12 గ్రామాలకు 8 గ్రామాల్లో డిజి టల్‌ సర్వే మ్యాప్‌లు సక్రమంగా ఉండటంతో పంట నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. లోపాలున్న గ్రామాల మ్యాప్‌లు పరిశీలించి వివరాలను వ్యవసాయశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నాణ్యత లేని ఆయిల్‌పామ్‌ మొక్కలతో మోసపోవద్దు

నల్లబెల్లి: ఆయిల్‌పామ్‌ సాగు చేపడుతున్న రైతులు మొక్కల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ మేనేజర్‌ రామ్‌చరణ్‌ సూచించారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనధికార నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసి రైతులు నష్టపోవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ద్వారా ఫ్యాక్టరీ జోన్‌ కేటాయించిన తమ సంస్థ ద్వారా నాణ్యమైన ఆయిల్‌పామ్‌ మొక్కలను పొందాలని కోరారు. అనధికార వనరుల నుంచి కొనుగోలు చేసిన మొక్కల వల్ల భవిష్యత్‌లో దిగుబడి తగ్గినా, ఇతర నష్టాలు సంభవించినా తమ సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేశారు.

వరుణుడి జోరు..

రాయపర్తిలో 95.8,

వర్ధన్నపేటలో 82 మిల్లీ మీటర్ల వర్షం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపాడు. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం నివేదిక ప్రకారం శనివారం రాత్రి 9 గంటల వరకు వరంగల్‌ జిల్లా రాయపర్తిలో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. వర్ధన్నపేటలో 82 మిల్లీమీటర్లు, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో 78.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పర్వతగిరి మండలం కల్లెడలో 73.8, నెక్కొండ మండలం కేంద్రంలో 47.5, రెడ్లవాడలో 73.5, చెన్నారావుపేటలో 62.5, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవపూర్‌లో 53.3, ములుగు జిల్లా మంగపేటలో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జనగామ జిల్లా కొడకండ్లలో 51.8, దేవరుప్పులలో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.

జిల్లాల సగటు పెరుగుదల

జిల్లాల సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వరంగల్‌లో 33.3 మిల్లీమీటర్లతో అత్యధికంగా నమోదైంది. ములుగు 27.4, మహబూబాబాద్‌ 24.8, జయశంకర్‌ భూపాలపల్లి 16.7, జనగామ 12.8, హనుమకొండ 8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్నటితో పోలిస్తే వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, హనుమకొండ జిల్లాల్లో వర్షపాతం పెరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మాత్రం నిన్నటి 18.2 మిల్లీమీటర్లతో పోలిస్తే శనివారం సగటు వర్షపాతం 16.7 మిల్లీమీటర్లుగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement