● అధ్వానంగా హనుమకొండ బస్‌స్టేషన్ ● నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందులు
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ల తర్వాత అంతే రద్దీ హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఉంటుంది. ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వందల బస్సులు వివిధ రూట్లలో ప్రయాణిస్తాయి. కానీ, ఈ బస్ స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. బస్‌స్టేషన్ ఆవరణ గుంతలమయంగా మారింది. చిన్న వర్షం పడినా గుంతల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమలు ముసురుతున్నాయి. బస్సు ఎక్కాలన్నా.. దిగాలన్నా ప్రయాణికుల నరకం చూస్తున్నారు. అడుగుకో గుంతతో బస్సులు సైతం మరమ్మతులకు గురవుతున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ


