పరకాలలో పవార్‌ | - | Sakshi
Sakshi News home page

పరకాలలో పవార్‌

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట షురూ

సాక్షి, వరంగల్‌: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఇప్పుడే రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునివ్వడం ఒకవైపు.. కొండా సుస్మితాపటేల్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోవైపు రాజకీయ వేడిని పెంచాయి. ఇదే సమయంలో కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి సైతం తాను లేదా తన సతీమణి పరకాల నుంచి బరిలో ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్‌లో మూడు వర్గాల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందే మొదలైన ఈ టికెట్‌ పోరు.. రానున్న రోజుల్లో ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు

మళ్లీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి

ప్రకాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని పిలుపు

తాజాగా గీసుకొండ వేదికగా

కొండా సుస్మితాపటేల్‌ ఘాటు వ్యాఖ్యలు

పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా

బరాబర్‌ బరిలో ఉంటానని స్పష్టం

తాను కూడా పోటీ చేస్తానని ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement