అవమానించడం బీజేపీ సంస్కృతి | - | Sakshi
Sakshi News home page

అవమానించడం బీజేపీ సంస్కృతి

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

అవమానించడం బీజేపీ సంస్కృతి

హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేపై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు వారి సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఖర్గేకు సంఘీభావంగా సత్యాగ్రహ నిరసన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా పబ్లిక్‌ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్‌.నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వద్ద ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే వంటి సీనియర్‌ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నిరసన ర్యాలీలో కాంగ్రెస్‌ టీపీసీసీ, డీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వరకు కాంగ్రెస్‌ నిరసన ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement