కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, నాయకుల అర్ధనగ్న ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

వరంగల్‌ చౌరస్తా: అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్‌ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వరంగల్‌ వెంకట్రామ జంక్షన్‌ నుంచి అర్ధనగ్న ప్రదర్శనగా కాశిబుగ్గ జంక్షన్‌కు చేరుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌, తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement