వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

– 8లోu

శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు..

పసుపు.. ౖపైపెకి

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర పెరుగుతోంది. క్వింటాకు గరిష్ట ధర రూ.16 వేలకు పైగా పలికింది. దీంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఉంటుంది. సాయంత్రం వేళ ఆహ్లాదంగా ఉంటుంది.

అంశం పనిభారం తగ్గే శాతం

సాక్షి, వరంగల్‌:

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొస్తున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రజాహితంగా సమూల మార్పులు తేనుంది. ప్రజా సమస్యలు, ఫైళ్లు, లెటర్ల తయారీ, సమావేశాల నిర్ణయాల అమలులో జాప్యాన్ని నియంత్రించేందుకు ఏఐ ఉపయోగపడనుంది. హనుమకొండ, వరంగల్‌ కలెక్టరేట్లలో 250 మంది అధికారులకు ఏఐ ఫర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎఫీషియెన్సీ శిక్షణ ఇచ్చింది. రోజువారీ ప్రభుత్వ పనుల్లో అధికారులు ఏఐ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద కూడా చాలెంజ్‌గా తీసుకొని అధికారులు ఏఐ వినియోగిస్తే ప్రజల సత్వర సేవలకు మరింత దగ్గరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక లేఖల తయారీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానాలు, ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికలు, మీటింగ్‌ మినిట్స్‌, జీఓ ఉత్తర్వుల సారాంశం, వివిధ పథకాల అమలుకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే సమాచారం రూపొందించడం వంటి పనుల్లో చాట్‌జీపీటీ, నోట్‌బుక్‌ఎల్‌ఎం, క్లాడ్‌, భాషిణి వంటి ఏఐ సాధనాలను వినియోగించనున్నారు. ఇలా నెలరోజుల్లో ఏఐ పనితీరుతో జిల్లా పరిపాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సాంకేతికతను అమలుచేస్తే ‘మీ పని పూర్తయ్యింది‘ అనే సమాధానం ప్రజలకు చేరనుంది. అదే జరిగితే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం మరింత బలపడుతుంది.

80%

పవర్‌పాయింట్‌/రిపోర్టులు

ప్రజా ఫిర్యాదులు

డేటా విశ్లేషణ

తెలుగు అనువాదం

మీటింగ్‌ మినిట్స్‌

డాక్యుమెంట్‌ సారాంశం

లెటర్ల తయారీ

82%

85%

88%

90%

92%

95%

ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..

వరంగల్‌ కలెక్టరేట్‌లో అధికారులకు ఏఐపై శిక్షణ ఇస్తున్న ట్రైనర్‌

ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం

వివిధ విభాగాల అధికారులకు సమాచారం, ఆదేశాలను త్వరగా చేరవేసేందుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా అయితే డ్రాఫ్ట్‌ రెడీ చేసుకునేందుకు గంటల సమయం తీసుకుంటుంది. అదే ఏఐకి సరైన ప్రాంప్ట్‌ ఇస్తే సెకన్ల వ్యవధిలోనే డ్రాఫ్ట్‌ రెడీ అవుతుంది. కోర్టు కేసుల్లోనూ 100 నుంచి 150 పేజీల డాక్యుమెంట్‌ ఉన్న కాపీలను గూగుల్‌ క్ల్లౌడ్‌లో స్కాన్‌ చేసి ఒక పేజీలో ముఖ్యమైన సారాంశం ఇవ్వాలని సరైన ప్రాంప్ట్‌ ఇస్తే సెకన్లలో సిద్ధమవుతుంది. అలాగే, అధికారులు కూడా తమ రోజువారీ పనుల్లో ఏఐ వాడితే ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుంది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ సేవలు త్వరగా చేరువ అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది. – డాక్టర్‌ సత్యశారద, కలెక్టర్‌

ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్‌ ఫ్రేమ్‌వర్క్‌ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్‌ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్‌ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది. – వాసుదేవ నటరాజ్‌, ఏఐ ట్రైనర్‌, టీఫైబర్‌

ఇలా చేస్తేనే

ఫలితం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement