పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

కాళోజీ సెంటర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని టీజీ ఈజేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన జనజాగరణ యాత్ర ఈనెల 29న వరంగల్‌ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌ ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ ఈజేఎసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్‌ పూర్తిగా విఫలమైందని, ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన భరోసా కల్పించాలంటే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనజాగరణ యాత్ర జూలై 11 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 23న శ్రీచలో హైదరాబాద్ఙ్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. టీజీ ఈజేఏసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌, జిల్లా గౌరవ అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా కోశాధికారి వొల్లాజీ రాజేందర్‌, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి సదానందం, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోవిందరావు, అశోక్‌, సృజన్‌ తేజ, ప్రేమలత, కృష్ణవేణి, మనోహర్‌, భవాని, రఘు, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీజీ ఈజేఏసీ నాయకుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement