‘సర్‌’పై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై నిర్లక్ష్యం వద్దు

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

నెక్కొండ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌)పై బీఎల్‌ఓలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారాలను తిరిగి తీసుకొని ఆన్‌లైన్‌ చేయాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ శ్రుతి అన్నారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో సర్‌ కార్యక్రమాన్ని ఆమె తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రుతి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబబాల ఫోన్‌ నంబర్లు సేకరించి ఓటరు సవరణ కార్యక్రమం గురించి వివరించి, ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా, అదే సమయంలో అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్‌ఓలకు ఆమె సూచించారు. నమోదవుతున్న దరఖాస్తులు, సిబ్బంది నిర్వహిస్తున్న ధ్రువీకరణ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఆర్‌ఐ నరేందర్‌, ఏఆర్‌ఐ సుధా, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ శ్రుతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement