సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి

Jul 11 2026 7:13 AM | Updated on Jul 11 2026 7:13 AM

సమన్వయంతో పనిచేయాలి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

దామెర: గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళికపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికతో గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు గుర్తించి ప్రధాన్యతా క్రమంలో దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు.

డిజిటైజేషన్‌ వేగవంతం చేయాలి..

సమగ్ర ఓటర్ల జాబితా సవరణ డిజిటైజేషన్‌ వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ బీఎల్‌ఓలకు సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా మండలంలోని ఊరుగొండలో చేపడుతున్న డిజిటైజేషన్‌ పక్రియను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా పరిషత్‌ సీఈఓ శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీకాంత్‌, తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, తదితరులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా నమోదు వేగవంతం చేయాలి

హన్మకొండ అర్బన్‌: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా దరఖాస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవితో కలిసి నిర్వహించిన సమీక్షలో వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ, నమోదు పురోగతిని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. వెనుకబడిన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శని, ఆదివారాల్లో సీనియర్‌, జూనియర్‌ సహాయకులను తక్కువ పురోగతి ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. వారు క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించి, దరఖాస్తుల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం పురోగతిని రోజువారీగా పర్యవేక్షిస్తూ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌, ఆర్డీఓ వెంకటేశ్‌, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర శిక్ష, పీఎం పోషణ్‌

అమలు వేగిరం చేయండి

జిల్లాలో సమగ్ర శిక్ష, పీఎం పోషణ్‌ కార్యక్రమాల అమలుతో పాటు ప్రగతి సమాచార వ్యవస్థలో ఆర్థిక, భౌతిక పురోగతి వివరాలను గడువులోగా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌వీ.గిరిరాజ్‌ గౌడ్‌, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు మహేశ్‌, డాక్టర్‌ మన్మోహన్‌, సునీత, సుమ, రఘుచంద్రరావు, క్రాంతికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement