కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం నగరంలోని కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధార్ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన తేదీల్లోగా విద్యార్థుల బయోమెట్రిక్ (వేలి ముద్రలు), ఐరీష్, అడ్రస్ తదితర వివరాలను నవీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న తరగతులను పరిశీలించారు. పలువురు నూతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.


