విద్యాసంస్థల బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

Jul 11 2026 7:13 AM | Updated on Jul 11 2026 7:13 AM

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

విద్యారణ్యపురి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విదత్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలల తరగతులు బహిష్కరింపచేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు ముందస్తుగానే బంద్‌ పాటించాయి. ఈసందర్భంగా వామపక్షాల విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులు కేయూ జంక్షన్‌ నుంచి ఎస్‌డీఎల్‌సీఈ మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌ రోడ్డులో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి హనుమకొండ పోలీస్టేషన్‌కు తరలించారు. వామపక్ష విద్యార్థి సంఘాల బాధ్యులు బాషబోయిన సంతోశ్‌ (ఏఐఎస్‌ఎఫ్‌), మంద శ్రీకాంత్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), బి.నర్సింహారావు (పీడీఎస్‌యూ), మాస్‌ సావిత్రి (ఏఐఎఫ్‌డీఎస్‌), మర్రి మహేశ్‌ (పీడీఎస్‌యూ), రోహిత్‌ (ఏఐఎస్‌బీ), వెంకటేశ్‌ (ఏఐడీఎస్‌ఓ), ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు స్టాలిన్‌, ఉట్కూరి ప్రణీత్‌, మోహన్‌, మిస్సా, తాజుద్దీన్‌, సమీర్‌, వంశీ, కార్తీక్‌, మధు, సురేశ్‌ పాల్గొన్నారు.

బైక్‌ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించిన

వామపక్ష విద్యార్థి సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement