భూ వివాదాలు లేకుండా సర్వే | - | Sakshi
Sakshi News home page

భూ వివాదాలు లేకుండా సర్వే

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

నెక్కొండ: నిజాం కాలం నాటి భూ రికార్డులు, హ ద్దుల నేపధ్యంలో కొనసాగుతున్న భూ సర్వేతో భూ వివాదాలకు చెక్‌ పడనుందని, ఇందుకోసం ప్రభుత్వం భూ రీసర్వేకు శ్రీకారం చుట్టిందని ల్యాండ్‌ సర్వేయర్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ జిల్లా అసిస్టెంట్‌ అ ధికారి ఎం.శ్రీనివాసులు అన్నారు. భూ రీసర్వేలో భాగంగా మొదటి విడతగా మండలంలోని వెంకటాపురంను పైలెట్‌ గ్రామంగా ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం వెంకటాపురంలో ఏర్పాటు చేసి న గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సర్వేకు అధునాతన రోవర్స్‌ మిషన్లు వాడుతామన్నారు. ఉపగ్రహ చానెళ్ల ద్వారా యంత్రాలు పనిచేస్తాయన్నారు. రైతుల సాగు భూములతోపాటు, చె రువులు, కుంటలు, ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఈ నెల 14 నుంచి సర్వే మొదలవుతుందని, అందరూ సహకరించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ప్రభాకర్‌, సర్పంచ్‌ కవిత పాల్గొన్నారు.

ల్యాండ్‌ రికార్డ్స్‌ జిల్లా అసిస్టెంట్‌

అధికారి శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement