గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

నర్సంపేట: గ్రామపంచాయతీల్లో సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా రూపొందించినా.. అమలు చేయడంలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్‌ క్లబ్‌లో శుక్రవారం గ్రామపంచాయతీ–సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం సమగ్ర ఓటరు ఇంటింటి సర్వేలో సర్పంచ్‌లు ముందుగా ఓటరు ఫారం నమోదు చేసి డిజిటలైజేషన్‌ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట ట్రైనీ డిప్యూటి కలెక్టర్‌ శృతిహర్షిత, ఆర్డీఓ ఉమారాణి, డీఆర్‌డీఓ నాగపద్మజ, అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

‘సర్‌’ సకాలంలో పూర్తి చేయాలి

నెక్కొండ: ‘సర్‌’ ప్రక్రియ ముందుకు సాగేలా అధికారులు సమష్టిగా కృషి చేసి, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. నెక్కొండ పట్టణంలో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్‌ సందర్శించారు. వెనక బడి ఉన్న పోలింగ్‌ స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంధ్యారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ శృతిహర్షిత, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

రుణాలు సకాలంలో అందించాలి

న్యూశాయంపేట: శ్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ హాల్‌లో శ్రీనిధి కార్యక్రమం అమలు, రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి దోహదపడే కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ.గణేశ్‌, శ్రీనిధి జోనల్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎన్‌. ఆర్‌ఎం.సైదిరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement