యాంత్రీకరణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

యాంత్రీకరణకు ప్రాధాన్యం

Mar 14 2026 7:18 AM | Updated on Mar 14 2026 7:18 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

వర్ధన్నపేట: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి యాంత్రీకరణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన 27 మంది రైతులకు 50 శాతం రాయితీపై రోటవేటర్స్‌, టేలర్స్‌, స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు రాయితీతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. డ్రోన్‌ స్ప్రేయర్లు రైతు సంఘాలు లేదా మహిళ సంఘాలకు కేటాయించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని పేర్కొన్నారు. పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్ర మంలో ఇల్లంద సర్పంచ్‌ బేతి సాంబయ్య, వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి, వైస్‌ చైర్‌ పర్సన్‌ నేతావత్‌ షిభారాణి రాజేందర్‌, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్‌ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్‌, వర్ధన్నపేట, పర్వతగిరి మండలా పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, జాటోతు శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement