విజయోస్తు.. | - | Sakshi
Sakshi News home page

విజయోస్తు..

Mar 14 2026 7:18 AM | Updated on Mar 14 2026 7:18 AM

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు – 10లోu

న్యూస్‌రీల్‌

వరంగల్‌
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు

ఘనంగా నిర్వహిస్తాం..

కాళేశ్వరంలో పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్‌ స్కూల్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంఈఓ చరణ్‌సింగ్‌

కాళోజీ సెంటర్‌: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 288 పాఠశాలల నుంచి 9,492 మంది విద్యార్థులు (బాలురు 4,932 మంది, బాలికలు 4,560 మంది) హాజరుకానున్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 47 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 47 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు, ఆరుగురు రూట్‌ అధికారులు, ఆరుగురు అదనపు రూట్‌ అధికారులు, 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు (ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులు), 496 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోని సీఎస్‌ రూంలలో 22 శాశ్వత సీసీ కెమెరాలు, మిగిలిన 25 ప్రభుత్వ కేంద్రాల్లో తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

విద్యార్థులకు సౌకర్యాలు..

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, కుర్చీలు, బెంచీలు, మరుగుదొడ్లు, వైద్యసేవలు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్‌ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతా లకు మొబైల్‌ ఫోన్లు తీసుకురావడం నిషేధం. అదేవిధంగా విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న వస్తువులు భద్రపరుచుకునేందుకు పరీక్ష కేంద్రాల్లోని ప్రవేశద్వారం వద్ద క్లాక్‌రూంలు ఏర్పాటు చేశారు.

హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌..

విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు హాల్‌టికెట్లపై క్యూర్‌ కోడ్‌ ముద్రించారు. గూగుల్‌ లెన్స్‌తో హాల్‌టికెట్‌పై ఉన్న క్యూర్‌ కోడ్‌పై స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రం వెళ్లడానికి మార్గం చూపుతుంది.

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు

సీసీ కెమెరాల నిఘా.. పోలీస్‌ బందోబస్తు

సమస్య ఉంటే 9440234571

నంబర్‌లో సంప్రదించవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement