పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : డీసీపీ | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : డీసీపీ

Mar 14 2026 7:18 AM | Updated on Mar 14 2026 7:18 AM

వరంగల్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధిలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సెంట్రల్‌ డీసీపీ దార కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (144 సెక్షన్‌) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని వివరించారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.

ముగిసిన ఇంటర్‌

సెకండియర్‌ పరీక్షలు

కాళోజీ సెంటర్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు పరీక్షకు 163 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. 4,736 మంది జనరల్‌ విద్యార్థులకు 4,605 మంది, 671 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 639 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement