న్యూశాయంపేట: జనగణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని, 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలు, దేశాభివృద్ధికి కీలకమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. జనాభా గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్‌స్థాయి అధికారులకు కలెక్టరేట్‌లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జనగణన సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. జనాభా గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన ఉంటుందని వివరించారు. మొదటి దశ మే 2026 మే నుంచి జూన్ 9 వరకు, రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారని ఆమె తెలిపారు. 1 మార్చి 2027ను రెఫరెన్స్ తేదీగా ప్రకటిస్తారని చెప్పారు. జనాభా గణన విభాగం సంయుక్త సంచాలకులు డి.సుబ్బరాజు, గణాంక అధికారి ఎస్.సతీశ్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సీపీఓ చంద్రకళ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఆఫీసర్‌ను నియమించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కలెక్టరేట్‌లో అధికారులకు శిక్షణ


