మినీ జాతరపై చిన్నచూపు
ఆత్మకూరు: ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు కొనసాగనున్న అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని భక్తులు వాపోతున్నారు. జాతర గడువు దగ్గర పడుతున్నప్పటికీ అధికారులు ఇంకా పటిష్ట నిర్మాణాత్మక పనులు మొదలుపెట్టలేదు. మినీ మేడారంగా పిలువబడుతున్న అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. గత జాతరలో భక్తులు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అధ్వానంగా జాతర రోడ్లు
అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర సమీపంలోని రోడ్లు గుంతలు పడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదకరంగా మారాయి. మండలంలోని కామారం క్రాస్‌రోడ్ నుంచి చౌళ్లపెల్లి మీదుగా అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే రోడ్డు అడుగడుగునా గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.
ప్రత్యేక నిధులు కరువు
సమ్మక్క–సారలమ్మ పుట్టిన తావుగా భావించే అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో సౌకర్యాల కల్పన ఇబ్బందిగా మారింది. ప్రత్యేక నిధులు విడుదల చేస్తేనే జాతరలో పనులు సంపూర్ణంగా జరుగుతాయని, లేకుంటే మొక్కుబడి పనులు జరుగుతాయని భక్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరపై దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
అగ్రంపహాడ్ జాతరకు మిగిలింది 20 రోజులే..
నిర్వహణకు కరువైన నిధులు
ప్రభుత్వం స్పందించాలని
భక్తుల వేడుకోలు
మినీ జాతరపై చిన్నచూపు


