నేడు జిల్లా మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
అరటిసాగుపై అవగాహన సదస్సు
దుగ్గొండి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో అరటితోటల సాగుపై జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడారు. అరటిసాగులో జాగ్రత్తలు పాటించకపొతే నష్టాల పాలు కావాల్సి వస్తుందన్నారు. మార్కెట్ అంచనాలను బట్టి సాగు సమయాలను ఎంచుకోవాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త వెంకటరాజుకుమార్ మాట్లాడుతూ అరటి మొక్కలు నాటిన మొదటి ఆరునెలలు కీలమమన్నారు. ఎన్‌పీకే ఎరువులను ఒక్కో అరటి మొక్కకు 200: 50: 200 గ్రాముల చొప్పున ఎరువులు వేయడంతో పాటు లీటరు నీటికి 5 గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్ మాట్లాడుతూ అరటితోటలో వచ్చే చీడపీడలు, తెగుళ్లు నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యానశాఖ అధికారి అలకొండ జ్యోతి, అనిల్, రైతులు లడె యుగందర్, సురేందర్, దుర్గునాల వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువలో 108 సేవలు
ఎంజీఎం: ప్రజలకు 108 సేవలు ఎల్లప్పుడూ చేరువలో ఉంటాయని 108 సర్వీస్ వరంగల్ జిల్లా మేనేజర్ గుర్రపు భరత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పి, ప్రసవనొప్పులు, జ్వరాల వంటి సందర్భాల్లో తమ సిబ్బంది అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో 108 సేవల ద్వారా మెడికల్ 37,681, ప్రసవ సంబంధిత కేసులు 3,303, ట్రామా వెహికులర్ 4,259, శ్వాస సంబంధిత సమస్యలు 2,430, గుండె సంబంధిత 2,165 కేసులు నమోదైనట్లు వివరించారు. ప్రజలు అత్యవసర సమయాల్లో 108 సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి
వరంగల్ అర్బన్: తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు కాలనీల్లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండ పరిధి 56వ డివిజన్ సురేంద్రపురి కాలనీలో తడి, పొడి చెత్తపై మంగళవారం ఆమె అవగాహహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేవిధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. గోపాల్‌పూర్ కాలనీలో డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్‌కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, డీఈ రవికిరణ్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, టీపీఎస్ సతీశ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాషానాయక్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్‌మోహన్ పాల్గొన్నారు.
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం సాయంత్రం సంకటహరచతుర్ధి పూజలు ఘనంగా జరిగాయి. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో వేదపండితులు దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి జలాభిషేకం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలు, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
నేడు జిల్లా మంత్రుల సమీక్ష
నేడు జిల్లా మంత్రుల సమీక్ష


