పోలీసుల పనితీరు అభినందనీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయుధ పోలీసుల పని తీరు అభినందనీయమని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సీపీ బుధవారం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్‌ను సీపీ తిలకించి, సిబ్బందికి ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగాన్ని సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా ఉమెన్ స్పెషల్ ఫోర్స్ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను విడదీయడం, తిరిగి జోడించడం. ఇతర విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. తనిఖీల్లో అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, శ్రీనివాస్, రవి, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


