కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలివ్వాలి
కాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే మల్టిపుల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌ఎంయూ)లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని బుధవారం ఆలిండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కాజీపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో రైల్వే పెన్షనర్స్ నాయకులు, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రైల్వే ఎలక్ట్రిక్ షెడ్డు క్వార్టర్స్ నుంచి రైల్వే ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్, రైల్వే ఆస్పత్రి మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ స్టీమ్ ఇంజన్ వరకు ర్యాలీ కొనసాగింది. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు ఎస్.ఆర్.వి.రావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు, రైల్వే యాక్ట్ అంప్రెంటీస్ వారికి, రైల్వే రిటైర్ట్ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలన్నారు. తెలంగాణ రైల్వే జేఏసీ చేపడుతున్న ఉద్యమాలకు ఆలిండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుపల్లి రాఘవేందర్, చైర్మన్ కోండ్ర నర్సింగరావు, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ నాయకులు ప్రేమ్‌కుమార్, ఎస్.సూర్యనారాయణ, వి.భిక్షపతి, రహమత్ అలీ, కె.వెంకటేశ్వర్లు, టి.కృష్ణమూర్తి, ఎం.కట్టయ్య, టి.రాజేశ్వర్, జి.గోపీ, ఎండీ అఫ్జల్, ఎ.ఐలయ్య, టి.సమ్మయ్య, ఎండీ అన్వర్‌మియా, ఎం.శంకర్, ఎస్.వెంకటస్వామి, ఎం.గట్టయ్య, ఎం.వెంకటేశ్వరరావు,రాజు, ఎం.పెంటయ్య, పి.ఎ.ఎబినేజర్, జాఫర్ పాల్గొన్నారు.
రైల్వే పెన్షనర్స్ నాయకుల ర్యాలీ


