నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
● ఎస్‌ఈ గౌతంరెడ్డి
సంగెం: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మొండ్రాయిలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి మూడు రోజులు ప్రతీ సెక్షన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామాలకు అధికారులు వచ్చినపుడు విద్యుత్ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.


