
పింఛన్ల కోసం రాజీలేని పోరాటం
నెక్కొండ: పింఛన్ల కోసం రాజీలేని పోరాటం చేశామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల మహాగర్జన సన్నాహక సదస్సు మండల కేంద్రంలోని ఓ గార్డెన్‌లో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, ఇతర చేయూత పింఛన్లను రూ.4 వేలకు పెంచి అండగా నిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎప్పడు ఎమ్మార్పీఎస్ ముందుండి ఉద్యమిస్తోందని మంద కృష్ణ పేర్కొన్నారు. పింఛన్లు పెంచకుంటే హైదరాబాద్‌లో జరిగే మహాగర్జనలో తమ గళం విప్పుతామని ఆయన హెచ్చరించారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కల్లెపల్లి ప్రణయ్‌దీప్, మండల అధ్యక్షుడు ఈదునూరి వెంకన్న, నాయకులు జనార్దన్, రాజుయాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ