
బండి సంజయ్‌పై వ్యాఖ్యలు సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
వరంగల్ చౌరస్తా: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. వరంగల్ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. కుట్రపూరితంగా 10 శాతం ముస్లింలను కలుపుకుని అంతా బీసీ రిజర్వేషన్లే అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధిపై నాయిని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎంజీఎం ఆస్పత్రి దయనీయంగా మారినా కనిపించడం లేదా అని రవికుమార్ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, రత్నం సతీశ్‌షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునారెడ్డి, జిల్లా కార్యదర్శి గోకే వెంకటేశ్, కోశాధికారి కూచన క్రాంతికుమార్, అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేశ్ పాల్గొన్నారు.