చిరువ్యాపారుల జీవితాలతో ఆటలొద్దు
హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారుల హక్కుల సాధన కోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ చౌరస్తాలో కూరగాయలు, బట్టలు అమ్ముకునే చిరువ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించిన నేపథ్యంలో.. శుక్రవారం క్షేత్రస్థాయిలో బాధితులతో ఆయన మాట్లాడారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరువ్యాపారులకు పరిహారం చెల్లించి, చౌరస్తాలోని అడ్డాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ రిజ్వాన్‌షమీమ్ చిరువ్యాపారులతో కలిసి స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి చిరువ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు ఏఐటీయూసీ నాయకులు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డి నేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్లు లోహిత రాజు, సోదా కిరణ్, చెన్నం మధు, సంపు నర్సింగ్ బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్, బొల్లెపెల్లి పున్నంచందర్, ఖలీల్ నాయకులు పేర్ల మనోహర్, జోరిక రమేశ్, మేకల బాబురావు, సారంగపాణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
వినయ్‌భాస్కర్
నేడు ఏకశిలపార్కు వద్ద ధర్నా


