డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్‌లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్‌క్లెయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించారు. కార్యక్రమంలో టీఅండ్‌బీ ఆర్‌ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్‌ఎల్‌బీసీ రిప్రజెంటేటివ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


