ఖరీఫ్‌లో ముందస్తు ప్రణాళికలు అవసరం
ధర్మసాగర్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని కేవీకే మామునూరు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజన్న సూచించారు. మండలంలోని మల్లక్‌పల్లిలో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో శుక్రవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ రాజన్న మాట్లాడుతూ.. వ్యవసాయ, పాడిపశువులకు సంబంధించి ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యాలను రైతులకు వివరించారు. నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చించి వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా నేలసారాన్ని కాపాడుకోవాలన్నారు. ఏఈఓ కల్యాణ్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. పశువైద్య శాస్త్రవేత్త సాయికిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రైతులకు సలహాలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనుపమ, విజయ డెయిరీ సూపర్‌వైజర్ రఘు, శోభ, పశు వైద్య సహచరులు ఎల్లారెడ్డి, రైతులు కరుణాకర్ తదితరులు ఉన్నారు.
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజన్న


