
నైతిక విలువలకు బీజేపీ ప్రాధాన్యం
హన్మకొండ: నైతిక విలువలకు బీజేపీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి.. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ ఇతర పార్లమెంట్ సభ్యులు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఆ మద్దతు నిరాకరిస్తూ ప్రభుత్వం దిగిపోయేందుకు నిర్ణయించుకున్నారని, బీజేపీ విలువలకు ప్రాధాన్యమివ్వడమంటే ఇదేనన్నారు. జాతీయ భావజాలం, దేశం కోసం పార్టీ పని చేస్తోందన్నారు. ఉత్తమ విలువలతో పని చేసే పార్టీ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు, విదేశీ దౌత్యనీతి, వక్ఫ్ బిల్లు వంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అవీనితికి తావు లేని సమర్థ పాలన అందిస్తున్న బీజేపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, తోపుచెర్ల మధుసూదన్ రావు, ఆకుల శ్రీకాంత్, నర్మెట్ట శ్రీనివాస్, రాజ్‌కుమార్, కందగట్ల సత్యనారాయణ, సంపత్‌రెడ్డి, సండ్ర మధు, ముత్యాల శ్రీనివాస్, మాలోతు నాను నాయక్, కళ్యాణ్, శ్రీకాంత్, ప్రసాద్, సతీశ్, జైపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, అరణ్య రెడ్డి, జన్ను మధు, అనురాధ, సారంగపాణి, మల్లికార్జున్, రాము, అనిల్, అభిషేక్ పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు
కొలను సంతోశ్ రెడ్డి
ఘనంగా పార్టీ
ఆవిర్భావ దినోత్సవం