
ప్రజెంట్ మేడమ్..
న్యూశాయంపేట: గత వారం ప్రజావాణిలో సమయపాలన పాటించకుండా వచ్చిన అధికారులను కలెక్టర్ మందలించారు. దీంతో సోమవారం అధికారులు గ్రీవెన్స్‌కు నిర్ణీత సమయంలోగా(ఉదయం 10:30లోగా) కలెక్టరేట్‌లోని సమావేశ హాల్‌కు చేరుకున్నారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, హౌసింగ్ పీడీ గణపతి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 120 దరఖాస్తులు రాగా.. వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఎక్కువగా రెవెన్యూ 50, జీడబ్ల్యూఎంసీ 21, హౌసింగ్‌కు 12 దరఖాస్తులు రాగా మిగితావి వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
నూతన ఒరవడి
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొత్త ఒరవడి సంతరించుకుంది. అధికారులకు ఎదురుగా దరఖాస్తుదారులకు సమావేశ హాల్‌లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. దరఖాస్తుదారులు సమావేశ హాల్ ఎదురుగా బయట నిరీక్షించకుండా హాల్‌లో సీరియల్ ప్రకారం కూర్చునేందుకు వీలుగా సీట్లు ఖాళీగా ఉంచారు. దీంతో సీరియల్ నంబర్ల వారీగా ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు రావడంతో ప్రజావాణి సాఫీగా సాగింది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు అనురాధ, కల్పన, నీరజ, ఏఓ విశ్వప్రసాద్, సూపరింటెండెంట్ సంబంధిత శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు కోసం తప్పుడు సర్వే
నా భర్త చనిపోయాడు. నాకు సొంత భూమిలేదు. ఇల్లు లేదు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. సర్వేలో సర్వేయర్ నాకు ఇంతకు ముందు ఇల్లు మంజూరైందని ఎంటర్ చేశారు. తప్పుడు సమాచారంతో నాకు ఇల్లు రాకుండా పోయింది. నాకు న్యాయం చేయాలి.
– ఐత సంపూర్ణ, క్రిస్టియన్ కాలనీ, వరంగల్
సమయానికి ప్రజావాణికి వచ్చిన అధికారులు
కలెక్టర్ గతవారం
ఆగ్రహించడంతో అలెర్ట్
ప్రజావాణిలో ప్రత్యేక ఒరవడి
సమావేశ హాల్‌లో
దరఖాస్తుదారులకు ప్రత్యేక సీట్లు
గ్రీవెన్స్‌కు ఒకరిద్దరు మినహా
అన్ని శాఖల అధికారుల హాజరు

ప్రజెంట్ మేడమ్..

ప్రజెంట్ మేడమ్..