
రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో కావ్యకు కాంస్యం
వర్ధన్నపేట: మండలంలోని ఉప్పరపల్లి ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీనపల్లి కావ్య ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 63 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం వేణు తెలిపారు. అదేవిధంగా పాఠశాలలోని పలువురు విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు పేర్కొన్నారు. కాంస్య పతకం సాధించిన కావ్యకు పాఠశాల హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, రాజు, లింగమూర్తి, విజయ, రూపారాణి, సదానందం, వీరస్వామి, మాధవరావు, రాజపద్మ, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ మోటారు చోరీ
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని ద్వారకపేట గ్రామ శివారులో గుండం నర్సమ్మకు చెందిన రూ.60 వేల విలువైన వ్యవసాయ మోటారు 7 హెచ్‌పీ చోరీకి గురైంది. సోమవారం ఉదయం నర్సమ్మ కుమారుడు మహేందర్ వెళ్లగా మోటారు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా.. పక్కనే ఉన్న రైతులు చిగురు కమలాకర్, ఏలబోయిన శ్రీనివాస్ ఇద్దరు ఒకరు వైరు, ఒక మోటారు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విషజ్వరంతో చిన్నారి మృతి
నెక్కొండ: విషజ్వరంతో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ కాశీం (తురక కాశి) మైబూబికి కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. కుమార్తె మోహ్రిన్ (5) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఈ నెల 8న విషజ్వరం బారినపడింది. మరుసటి రోజు నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని అమృత ఆస్పత్రిలో చేర్చగా చికిత్స అందించారు. ఈక్రమంలో జ్వరం తీవ్రమై ఆరోగ్యం క్షీణించి, బ్రెయిన్ డెడ్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జ్వరం వచ్చిన మూడు రోజులకే చిన్నారి మృతి చెందడంపై గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దూర విద్య ప్రవేశాల
గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్‌లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్‌ఐఎస్సీ కోర్సులతోపాటు మరో తొమ్మిది డిప్లొ మా, 14 సర్టిఫికెట్, ఏడు ఓరియెంటేషన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జత చేసి రుసుం ఆన్‌లైన్‌లోగానీ, దూరవిద్యాకేంద్రంలో క్యూ ఆర్ స్కాన్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.
బాధిత కుటుంబాలకు
ఎమ్మెల్యే పరామర్శ
నెక్కొండ: మండల కేంద్రానికి చెందిన ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు తల్లి లక్ష్మి, రిటైర్డ్ టీచర్ మెట్టు నర్సింహరెడ్డి తండ్రి మోహన్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. మృతుల చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మె ల్యే వెంట నాయకు లు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, పెండెం రామానందం, నెక్కొండ, నర్సంపేట మా ర్కెట్ చైర్మన్లు రావుల హరీశ్‌రెడ్డి, పాలాయి శ్రీని వాస్, బక్కి అశోక్, కేవీ.సుబ్బారెడ్డి, ఆవుల శ్రీనివాస్, లావుడ్యా తిరుమల్, మాదాటి శ్రీనివాస్, ఈదునూరి సాయికృష్ణ, కొమ్మారెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో కావ్యకు కాంస్యం