వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Aug 12 2025 7:27 AM | Updated on Aug 12 2025 12:34 PM

వరంగల

వరంగల్‌

మూగబోయిన మహిళా చైతన్య దీప్తి

– 8లోu

న్యూస్‌రీల్‌

ఎంపిక చేసిన గ్రామాలివే..

మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఖానాపురం:

వ్యవసాయంలో పురాతన పద్ధతులను అలవర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా రైతులతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫామింగ్‌) కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరంగల్‌ జిల్లావ్యాప్తంగా 13 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో వ్యవసాయ అధికారి పరిధిలో క్లస్టర్ల విభజన కావడంతో విస్తరణ అధికారులు సైతం విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 57 క్టస్టర్లు ఉన్నాయి. ఇందులో పది గ్రామాలను, వీటి పరిధిలో 1,250 మంది రైతులను ఎంపిక చేశారు. జిల్లాలో 625 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయానికి భూములను గుర్తించారు.

ప్రకృతి వ్యవసాయానికి చర్యలు

ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ కార్యక్రమం ద్వారా మండలానికి ఒక క్లస్టర్‌ను ఎంపిక చేసి వాటి పరిధిలో ఉన్న రైతులను గుర్తించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి చర్యలు చేపట్టారు. ఒక్కో క్లస్టర్‌కు 125 మందితో సేంద్రియ వ్యవసాయం చేయించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన క్లస్టర్ల పరిధిలో రైతులను గుర్తించి వారికి అవగాహన సమావేశాల్ని సైతం ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన రైతులకు సంబంధించిన భూముల వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి ల్యాబ్‌లకు సైతం పంపించారు. నేలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవవైవిద్యాన్ని పెంచడానికి భూమి సహజ వనరులను పరిరక్షించడానికి పథకం ద్వారా రైతులకు వివరించనున్నారు. ప్రకృతి, సేంద్రియ సేద్యం చేయిస్తూ.. సహజ పద్ధతిలో సాగు చేయించడానికి అధికారులు రైతుల్ని సిద్ధం చేస్తున్నారు.

మహిళల ఎంపిక

రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయించడానికి రైతులను ఇప్పటికే సిద్ధం చేశారు. ఎంపిక చేసిన క్లస్టర్లలో 125 మందిలో మహిళలను సైతం ఎంచుకున్నారు. ఒక్కో క్లస్టర్‌ నుంచి ఇరువురు మహిళలను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో 20 మంది మహిళల వివరాలు సేకరించారు. వీరు మహిళా సంఘాలతో అనుబంధం ఉండేలా చూస్తున్నారు. ఎంపిక చేసిన మహిళలకు ‘కృషి, సఖి’లుగా నామకరణం చేయనున్నారు. వీరికి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. జిల్లా స్థాయిలో ప్రతీ సమావేశానికి ఇరువురు మహిళలు హాజరుకావాల్సి ఉంటుంది. వీరు వాళ్ల క్లస్టర్‌ పరిధిలో ఎంపిక చేసిన రైతుల వద్దకు వచ్చి వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మహిళా రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటు ఇతర రైతులతో చేయించేలా వీరు కృషి చేయాల్సి ఉంటుంది. రైతులతో చేయించేందుకు వీరికి గౌరవ వేతనం సైతం ఇవ్వనున్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మూడేళ్ల పాటు సాగు ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ పథకం కింద ఇన్‌పుట్‌ సబ్సీడీలను సైతం రైతులకు అందిస్తూ ప్రోత్సహించనున్నారు.

మూగబోయిన మహిళా చైతన్య దీప్తి

హనుమకొండకు చెందిన ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు. ఆమె మృతిపై సాహిత్యాభి మానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

– 8లోu

న్యూస్‌రీల్‌

జిల్లావ్యాప్తంగా 1,250 మంది రైతుల ఎంపిక

ఒక్కో క్లస్టర్‌కు 125 మంది

అందులో 20 మంది మహిళలకు అవకాశం

మహిళలకు ‘కృషి, సఖి’లుగా నామకరణం

625 ఎకరాల భూమి గుర్తింపు

యూనిట్‌కు ఇన్‌పుట్‌ సబ్సిడీలు

ఎంపిక చేసిన గ్రామాలివే..

జిల్లా వ్యాప్తంగా పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో ఖానాపురం మండలంలోని చిలుకమ్మతండా, పర్శతండా, మంగళవారిపేట, నల్లబెల్లి మండలంలోని గోవిందాపురం, కొండాపూర్‌, నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, పెద్దకొర్పోలు, దుగ్గొండి మండలంలోని రాజ్యతండా, నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట క్లస్టర్‌ పరిధిలోని లైన్‌తండా, రాయపర్తిలోని వాంకుడోతు తండాలను ఎంపిక చేశారు.

వరంగల్‌1
1/2

వరంగల్‌

వరంగల్‌2
2/2

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement