
నులిపురుగుల నివారణతో సంపూర్ణ ఆరోగ్యం
గీసుకొండ: నులిపురుగుల నివారణతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గీసుగొండ మండలం ధర్మారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు కలెక్టర్ నులిపురుగుల మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం మాత్రలు తీసుకోని వారికి ఈనెల 18న మాప్–అప్ కార్యక్రమం ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ధర్మారం అంగన్‌వాడీ కేంద్రంలో కలెక్టర్ సత్యశారద చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రకాశ్, డాక్టర్ కొమురయ్య, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈఓ జ్ఞానేశ్వర్, పాఠశాల హెచ్‌ఎం సాంబయ్య, వైద్యాధికారులు శౌర్య శరణ్య, నేహా, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పీహెచ్‌సీ సిబ్బంది, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
విద్యార్థులకు మాత్రల పంపిణీ