అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏ | - | Sakshi
Sakshi News home page

అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏ

Aug 11 2025 6:21 AM | Updated on Aug 11 2025 6:21 AM

అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏ

అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏ

రామన్నపేట: పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(టీసీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం వరంగల్‌ నగరంలోని ఐఎంఏ హాల్‌లో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జైపాల్‌ సమన్వయంతో టీసీఏ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ క్రికెట్‌ అభివృద్ధి కోసం టీసీఏ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను క్రికెట్‌ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 2021 జూలై బీసీసీఐ ఇచ్చి కోలాబరేషన్‌ ఆదేశాలను హెచ్‌సీఏ పాటించలేదని బాంబే హైకోర్టు కంటెంప్ట్‌ ఆదేశాల ప్రకారం 29 మార్చి 2025న జరిగిన హెచ్‌సీఏ–టీసీఏ చర్చలకు తుదిరూపం ఇవ్వకపోవడం ద్వారా హెచ్‌సీఏకి తెలంగాణ క్రికెట్‌ అభివృద్ధిపై చిత్తుశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. పొన్నాల జగన్‌, విజయ్‌చందర్‌రెడ్డి, సమీ, ఎండీ జాకీర్‌ హుస్సేన్‌, స్టీఫెన్‌, శరత్‌యాదవ్‌, ఎండీ.మోహిన్‌ పాల్గొన్నారు.

టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement