
కొత్త కాల్వలకు మోక్షం
పరకాల: ‘శానిటేషన్ సవాల్’ శీర్షికన జూలై 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పరకాల పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లోని బ్రహ్మణవాడ, గండ్రవాడ, వడ్లవాడలో డ్రెయినేజీ నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ సుష్మ చర్యలు చేపట్టారు. 30ఏళ్ల క్రితం నిర్మించిన పట్టణంలో ని కాల్వలు కూరుకుపోయాయి. దీంతో రోడ్లపై నుంచి మురుగునీరు పారుతోంది. వర్షాకాలమైతే పరిస్థితి మరీ అధ్వానం. ఈనేపథ్యంలో సాక్షి ప్రచురించిన కథనంపై స్పందిస్తూ స్థానిక ఎమ్మెల్యే రేవూ రి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ డ్రెయినేజీ లేక ఇబ్బందులు పడుతున్న కాలనీలకు ముందుగా డ్రెయినేజీ కాల్వలు చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ చర్యలు చేపట్టారు. నెల క్రితం ప్రతిపాదనలు చేపట్టారు. పనులు ప్రారంభం కావడంతో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అయ్యిందని స్థానికులు సాక్షికి ధన్యవాదాలు చెబుతున్నారు.

కొత్త కాల్వలకు మోక్షం